కొత్త e-PAN Card 2.0 QR కోడ్‌తో.. ఆధార్‌ లాంటి బెనిఫిట్స్.

కొత్త పాన్ కార్డ్ కి upgrade కావాలా? ఆదాయపు పన్ను శాఖ ఇటీవల పాన్ కార్డు వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసింది. ఇది కొత్త పాన్ 2.0ని ప్రవేశపెట్టింది. మొత్తం ప్రక్రియ (PAN కార్డ్ 2.0) భద్రత దృష్ట్యా సులభతరం చేయబడింది.

నవంబర్ 26, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పాన్ 2.0 ప్రాజెక్ట్ సమాచారంపై పాన్ 2.0 ద్వారా పాన్ మరియు టాన్ నిర్వహణ ప్రక్రియను క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపింది.

ఈ e-PAN డిజిటల్ వెర్షన్ ను మీరు ఫ్రీగా పొందవచ్చు. దీనిని మీరు ఇమెయిల్ ద్వారా పొందవచ్చు. నామమాత్రపు 50/- రుసుము చెల్లించిన తర్వాత ఫిజికల్ పాన్ కార్డ్ మీ రిజిస్టర్ అడ్రస్‌కు చేరుకుంటుంది. QR కోడ్ లేని సాధారణ PAN కార్డ్ మీ దగ్గర ఉంటే.. అది కూడా ఇప్పటికీ పూర్తిగా వ్యాలీడ్ అని గమనించాలి. దీన్ని అప్‌డేట్ చేయకపోయినా పాత కార్డు పనిచేస్తుంది. ఈ కొత్త పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ కూడా ఉంది. పాన్ 2.0 ద్వారా జారీ చేయబడిన పాన్ కార్డ్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది ఆధార్ కార్డు లా పనిచేస్తుంది. స్కాన్ చేయడం ద్వారా ధృవీకరణ ప్రక్రియను ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

ముక్యంగా దీని ఉద్దేశ్యంQR కోడ్‌తో స్కాన్ చేయగల e-PAN మంచి సౌకర్యాలను అందిస్తుంది. స్పీడ్ అథెంటికేషన్ అందిస్తుంది. e-PAN Card ఫ్రాడ్ లేదా దుర్వినియోగ అవకాశాలను నివారిస్తుంది. ఆధార్ కార్డు లా పనిచేస్తుంది

కొత్త కార్డు దరఖాస్తుకు కావలసిన డాక్యుమెంట్లు :

ఆధార్ కార్డు

ఓటరు గుర్తింపు కార్డు

పాస్‌పోర్ట్

డ్రైవింగ్ లైసెన్స్

NSDL ద్వారా (PAN Card 2.0) కార్డుకు ఎలా అప్లయ్ చేసుకోవాలి? :

https://tinpan.proteantech.in/ వెబ్‌సైట్‌కి వెళ్లండి.

Select PAN Application Type (New or Change Request)

Select Applicant Category (Individual, Trust, HUF,…)

మీ పాన్ నంబర్, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఎంటర్ చేయండి.

డిక్లరేషన్లను అంగీకరించి “Submit”పై క్లిక్ చేయండి.

మాస్క్ పాన్ వివరాలను ధృవీకరించండి.

Submit digitally through e-KYC & e-Sign (Paperless)

Submit scanned images through e-Sign

Forward application documents physically

Whether Physical PAN Card is required?

Fees Applicable (or) No Fees Applicable

Aadhaar Number (Only for Individual)

ఆధార్ నెం ఎంటర్ చేయండి.

మీ తల్లి, తండ్రుల పేర్లు ఇవ్వండి. ఇంకా కొంత సమాచారం ఇచ్చిన తరువాత

OTP కోసం మొబైల్/ఇమెయిల్/రెండూ ఎంచుకోండి. ఇప్పుడు OTP వస్తుంది. 10 నిమిషాల్లో వెరిఫై చేసుకోండి.

ఆ తర్వాత పేమెంట్ పేజీకి వెళ్లి, నిబంధనలుపై క్లిక్ చేసి, రూ. 50 రుసుము చెల్లించండి. పేమెంట్ తర్వాత మీకు రశీదు వస్తుంది. రశీదు సేవ్ చేసి పెట్టుకోండి.

24 గంటల తర్వాత మీ e-PAN డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలంటే మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు 15 రోజుల నుంచి 20 రోజుల్లో డెలివరీ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *