Toll Gate Tax Free : మీరు టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఈ నియమాలు మీకూ వర్తిస్తాయి.
టోల్ టాక్స్ రూల్స్: భారతదేశంలో జాతీయ రహదారి విస్తరణ వేగవంతం అవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే జాతీయ రహదారి విస్తరణ చాల వేగవంతంగా కొనసాగుతుంది. అయితే ఈ రహదారి విస్తరణలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ప్రతి జాతీయ రహదారిలో టోల్ ప్లాజాను ఏర్పాటును కల్పిస్తుంది.
ప్రస్తుతం మన దేశంలో సుమారుగా అన్ని రాష్ట్రాలకు అనుసంధానించే విదంగా ప్రణాళికలు చేస్తూ వ్యాపార వాణిజ్య సముదాయాన్ని పెంచుకుంటుంది. ఈ క్రమంలో ప్రతి రాష్ట్రంలో అనేక టోల్ ప్లాజాలు ఉన్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారుగా 1063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. జాతీయ రహదారి విస్తరణ దృష్ట్యా వీటి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. గత 5 సంవత్సరాలలో చుస్తే ఇవి గణనీయంగా 400 కి పైగా కొత్త టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయబడ్డాయి.
త్రిచక్ర వాహనాల నుండి భారీ వాహనాల వరకు, మీరు జాతీయ రహదారిపై నడపడానికి టోల్ గేట్ వద్ద పన్ను తప్పకుండా చెల్లించాలి. టోల్ ఛార్జ్ చెల్లించిన తర్వాతే టోల్ గేట్ దాటడానికి అనుమతి ఉంది. అయితే, గతంలో, టోల్ ఛార్జీలును డబ్బులు ఇచ్చి అంటే మాన్యువల్‌గా చెల్లించేవారు. ఇప్పుడు దానిని కూడా ఆన్లైన్లో కట్టుకునే సౌలభ్యం కల్పించింది. అదే ఫాస్ట్‌ట్యాగ్. ఈ ఫాస్ట్ టాగ్ అందుబాటులోకి వచ్చిన తరువాత చెల్లింపులు మరింత సులభతరం అయింది. ఈ ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా, చెల్లింపులు సెకన్లలో జరుగుతున్నాయి.
అయితే, ఫాస్ట్‌ట్యాగ్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నియమాలను పెట్టింది. అందులో 2 నియమాలు చాలా ముఖ్యమైనది.
ఇందులో ప్రత్యేకమైనవి చాలా ఉన్నాయి. ప్రభుత్వ వాహనాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతి, గవర్నర్, VIP, కొన్ని సందర్భాల్లో స్కూల్ బస్సులు, ఇంకా కొన్ని రాయితీలు కల్పించింది.
అయితే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేక నియమ నిబంధనలను రూపొందించింది. ఇందులో సామాన్యులకు ఉపయోగపడే 2 ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అందులో
1. 10 సెకన్ల నియమం.
మీరు టోల్ ప్లాజా వద్ద 10 సెకన్లు కంటే ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తే మీరు ఆ టోల్ ఛార్జ్ ని పే చేయాల్సిన అవసరం లేదు.
ఈ నియమం రద్దీగా ఉండే సమయాల్లో కూడా ఈ వర్తిస్తుందని NHAI స్పష్టం చేసింది. ఈ నియమాన్ని NHAI 2021లో తీసుకువచ్చింది.
2. మీరు టోల్ ప్లాజా నుండి 20 కి.మీ దూరంలో ఉన్న వాహనదారులకు ఈ రుసుము నుండి మినహాయింపు ఇచ్చింది. స్థానిక ప్రజలుకు ఈ అవకాశం కల్పించింది. అయితే, వాణిజ్య మరియు వ్యాపార వాహనాలకు ఈ నియమం అందుబాటులో లేదు. అందుకు మీరు ఆధార్ కార్డు, లేదా స్థానిక నివాసి పాస్ లేదా నెలవారీ పాస్ పొందాలి. ఒకవేళ, మీ దగ్గర సరైన స్థానికత రుజువు పత్రం లేకుంటే, మీరు రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.