రైల్వేలో ఉద్యోగాలు, డిగ్రీ పాసైతే చాలు… 92 వేల జీతంతో గ్రేడ్-1 పోస్టులు
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక తీపి సందేశాన్ని ఇచ్చింది. రైల్వే లో ఉద్యోగం పొందాలని కోరుకునేవారు నేరుగా ఈ నోటిఫికేషన్ ద్వారా వివరాలు apply చేసుకోవచ్చు. కోరుకుంటారు. రైల్వే లో ఉద్యోగం చేసేవారికి చాలా రకాల అలవెన్సులు మరియు ప్రయాణ సౌకర్యం తో పాటు నెలాఖరుకు మీ అకౌంట్ లో నేరుగా జీతం చెల్లించబడుతుంది. మరి ఇలాంటి అవకాశాన్ని చేజారుకోవద్దు.
ముఖ్యంగా చాలామంది రైల్వేలో ఉద్యోగం చేయాలనీ కళలు కంటారు. అలాంటి కళలను మీరు నిజం చేసుకునేందుకు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది.
దేశవ్యాప్తంగా రైల్వే జోన్లలో 6180 పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయబడింది. ముక్యంగా 51 విభాగాల్లో గ్రేడ్ – 1 మరియు గ్రేడ్ – 3 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) క్రింద అధికారిక వెబ్సైట్ ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు.
జోన్ ప్రకారం RRB టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2025 ఖాళీల వివరాలు:
Southern Railway (SR) 1,215
Eastern Railway (ER) 1,119
Western Railway(WR) 849
North Central Railway (NCR) 241
Chittaranjan Locomotive Works (CLW) 222
Northern Railway (NR) 478
Integral Coach Factory (ICF) 404
Northeast Frontier Railway (NFR) 317
Central Railway (CR) 305
Patiala Locomotive Works (PLW) 218
East Coast Railway(ECOR) 79
East Central Railway(ECR) 31
North Eastern Railway (NER) 68
North Western Railway (NWR) 188
Rail Coach Factory (RCF) 47
Rail Wheel Factory (RWF) 36
South Central Railway (SCR) 89
South East Central Railway (SECR) 57
South Eastern Railway (SER) 180
South Western Railway (SWR) 106
West Central Railway(WCR) 126
Note: RRB వెబ్సైట్లో అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదు. కాబట్టి పోస్టుల సంఖ్యలో మార్పులు ఉండవచ్చు.
పోస్టుల వివరాలు:
టెక్నీషియన్ గ్రేడ్ – I (సిగ్నల్): 180 పోస్టులు
టెక్నీషియన్ గ్రేడ్ – III: 6000 పోస్టులు
మొత్తం: 6180 పోస్టులు
విద్యా అర్హతలు:
గ్రేడ్ – I టెక్నీషియన్ (సిగ్నల్): డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కమ్యూనికేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా బి.ఎస్సీ/ బిఇ/ బి.టెక్
గ్రేడ్ – III టెక్నీషియన్: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, సంబంధిత ఐటిఐ లేదా 12వ తరగతి (ఎన్సివిటి లేదా ఎస్సివిటి) ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం:
గ్రేడ్ – I జీతం రూ. 29,200 నుండి రూ. 92,300
గ్రేడ్ – III జీతం రూ. 19,900 నుండి రూ. 63,200.
వయోపరిమితి:
గ్రేడ్ – I (సిగ్నల్): 18 సంవత్సరాలు – 33 సంవత్సరాలు.
గ్రేడ్ – III: 18 సంవత్సరాలు – 30 సంవత్సరాలు.
వయో సడలింపు:
ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు.
ఓబీసీలకు 3 సంవత్సరాలు (క్రీమీ లేయర్ లేనివి).
పిడబ్ల్యుడిలకు 10 సంవత్సరాల వయో సడలింపు.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ. 500/- ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగ్: రూ. 250/- ఈ రుసుము క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి.
పరీక్షా విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష
పరీక్ష తేదీ: ఇంకా విడుదల చేయలేదు.
అభ్యర్థులకు హెచ్చరిక: నెగటివ్ మార్కింగ్ ఉంది.
ఎంపిక విధానం:
1. CBT పరీక్షలలో మెరిట్
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
3. వైద్య పరీక్షలు
భారతీయ రైల్వేల అధికారిక వెబ్సైట్: https://indianrailways.gov.in
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 10-06-2025
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 28-06-2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 28-07-2025 (రాత్రి 11.59)
నోట్: RRB వెబ్సైట్లో అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదు. పోస్టుల సంఖ్య మారే అవకాశం ఉంది.