స్మార్ట్‌ఫోన్లకు ఇంటర్నెట్‌ నేరుగా శాటిలైట్‌ నుండి.

స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి శుభవార్త. ప్రస్తుత రోజుల్లో మొబైల్ వినియోగంలో లేని వారుండరు. అందుకు గల కారణం ప్రపపంచంలో ఏ మూలాన ఏమి జరిగిన మనకు వెంటనే తెలిసిపోతుంది. అందుకు గల ప్రత్యేక కారణం ఇంటర్నెట్. మొబైల్ కు డాటాను లేదా వైఫై సపోర్ట్ తో ఎలాంటి ఇతర పరికరాలు అవసరం లేకుండా మనం ఇంటర్నెట్ లో తెలుసుకుంటున్నాము. అయితే దీనికి కొన్ని ప్రత్యేకమైన software లు కావాలి.

ఇలాంటి ఏ సాఫ్ట్వేర్ లు అవసరం లేకుండా డైరెక్టుగా satelite ద్వారా మీ మొబైల్ కు ఇంటర్నెట్ సదుపాయాన్ని అమెరికాకు చెందిన శాటిలైట్ల తయారీ సంస్థ ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌ సేవలు అందిస్తుంది. దీనికి సంబంధించి సంస్థ ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. Satelite ఆధారిత సెల్యులార్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను తీసుకొస్తున్న మొదటి మరియు ఏకైక కంపెనీ ఇది మాత్రమే.

ఎలాన్‌ మస్క్‌కు చెందిన Space X కు పోటీ సంస్థే ఈ ఏఎస్‌టీ. స్పేస్ X కు బిన్నంగా ఆలోచిస్తూ దూసుకెళుతుంది.

వాణిజ్య, వ్యాపార సేవలు, ప్రభుత్వ సంబంధిత ఇతర సేవల కోసం ఈ నెట్‌వర్క్‌ను డిజైన్‌ చేసినట్లు వొడాఫోన్‌ ఐడియా వివరించింది. భారత్‌లో కూడా మొబైల్‌ అనుసంధానం లేని ప్రాంతాల్లో ఈ Satelite ఆధారిత సెల్యులార్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడం కోసం ఇరు కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి.

అదనంగా ఎటువంటి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ లేదా పరికరాల సహకారం మరియు అప్‌డేట్‌ల అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్లకు నేరుగా స్పేస్‌ ఆధారిత సెల్యులార్‌ నెట్‌వర్క్‌ను అందించే వీలును ఏఎస్‌టీ, వొడాఫోన్‌ఐడియా భాగస్వామ్యం కల్పించడం టెక్నాలజీ లో ఇదొక విప్లవాత్మకం అనే చెప్పుకోవాలి.

ఇప్పుడు ఉన్న ప్రస్తుత మొబైల్‌ ఫోన్లలోనే అంతరిక్షాన్ని ఉపయోగించుకుని వాయిస్ మరియు వీడియో కాల్‌ సేవలు అందించడం ద్వారా ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌ చరిత్ర సృష్టించిందని వెల్లడించింది.

4జీ, 5జీ సేవలు నేరుగా మా అంతరిక్ష ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ ఎలా పనిచేస్తుందో నిరూపించడానికి విస్తృతంగా మరియు చురుకైన టెలికాం మార్కెట్‌ ఉన్న భారత్ సరైన ఎంపిక అవుతుంది. మా కవరేజీని విస్తృతం చేయడమే కాకుండా కనెక్టివిటీకి ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నాం. అంతరిక్షం నుంచే 4జీ, 5జీ సేవలు నేరుగా స్మార్ట్‌ఫోన్లకు అందిస్తామ’ని ఆ సంస్థ ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ క్రిస్‌ ఐవరీ పేర్కొన్నారు.

ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించనుంది. మన దేశ టెలికాం విభాగం (డాట్‌) లైసెన్సు మంజూరు చేసింది. అయితే ఈ స్టార్‌లింక్‌ సేవలు పొందాలనుకునేవారు ప్రత్యేకంగా పరికరాలను కొనాల్సి ఉంటుంది. స్టార్‌లింక్‌తో అంబానీకి చెందిన జియో మరియు సునీల్‌ మిత్తల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు కంపెనీలకు మనదేశ టెలికాం విభాగంలో 70 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. కానీ ఏఎస్‌టీ నెట్‌వర్క్‌ మాత్రం ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే 4జీ, 5జీ సేవలను నేరుగా మొబైల్‌కు అందిస్తామంటోంది.

అయితే, ఈ సేవలను ఎపుడు ప్రారంభించేదీ వొడాఫోన్‌ ఐడియా ఇంకా వెల్లడించలేదు. ఈ విషయమై ‘సరైన సమయంలో సమాచారం ఇస్తామ’ని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ ఒప్పందంపై ఇప్పటికే వొడాఫోన్‌ ఐడియా ప్రమోటరు సంస్థ వొడాఫోన్‌ పీఎల్‌సీ ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో సంతకాలుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *